నష్టపోయిన పంటలను పరిశీలించిన అధికారులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షంతో నేలకొరిగిన పంట పొలాల వివరాలను సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో సేకరించి వ్యవసాయ శాఖ అధికారులకు అందించి,పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరడంతో దరఖాస్తుల ప్రకారం నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం పరిధిలోని పొలాలను రైతులతో కలిసి
పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం,రైతులు పాల్గొన్నారు.
చూడండి ఎంత దారుణమో.. మహిళా పోలీస్‌పై దుండగుడి అరాచకం.. నెటిజన్లు ఫైర్..