మేడిగడ్డ వంతెన కుంగిపోవడంతో అధికారుల అలర్ట్
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ క్రమంలో 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన వాజేడు, వెంకటాపురం మండలాలకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అయితే వంతెన కుంగిపోవడానికి సంఘ విద్రోహ శక్తులే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే లక్ష్మీ బ్యారేజ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్15, శుక్రవారం 2024