పూజలో ప్రసాదంగా పంచదారను సమర్పించడం మంచిదో కాదో తెలుసా..
TeluguStop.com
మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వారి ఇళ్లలో భగవంతునికి పూజలు చేసి హారతులను ఇస్తూ ఉంటారు.
అంతే కాకుండా మరి కొంత మంది భగవంతునికి ప్రసాదాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా పండగ సమయాలలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.ఇలా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే ఆ కుటుంబ సభ్యులంతా ఏదైనా ఆహారాన్ని తింటూ ఉంటారు.
ఆ తర్వాత వండిన ఆహార పదార్థాలన్నీ ఇంటిల్లిపాది అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు.
ముఖ్యంగా ప్రసాదం అనగానే ఎక్కువగా చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, పాయసం, దద్దోజనం వంటి వంటకాలు వండడం అనేది చాలా మందికి తెలిసిన విషయమే.
అయితే ప్రతి రోజు పూజ చేసే సమయంలో కొన్ని సందర్భాలలో చక్కెర నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
చాలా మంది ఇలా చక్కెర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడం అనేది మహా పాపం అనడం మనం చాలాసార్లు వింటూనే ఉంటాము.
నిజానికి ప్రతి సారి ఇలా ప్రసాదం వండి నైవేద్యంగా సమర్పించాలి అంటే కొన్నిసార్లు కష్టమే అని చెప్పాలి.
అలాంటప్పుడు కొంత మంది ఇళ్లలో అందుబాటులో ఉన్న పండ్లు, పాలు, చక్కెర వంటివి భగవంతునికి నైవేద్యంగా పెట్టడంలో ఇలాంటి దోషం లేదని మరి ముఖ్యంగా పంచదార పలుకులు నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం ద్వారా అది ప్రసాదంగా మారిపోతుందని వేద పండితులు చెబుతున్నారు.
"""/" /
కాబట్టి చక్కెర నైవేద్యంగా సమర్పించడం మనకు ఎటువంటి అనుమానం అక్కర్లేదని కూడా వేద పండితులు చెబుతున్నారు.
అందువల్ల ఎవరు కూడా చక్కెరను నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం తప్పు కాదు అనే విషయం తెలుసుకోవాలి.
ఈ చక్కెరను నైవేద్యంగా ఎప్పుడు సమర్పించాలంటే మనకు అందుబాటులో ఏ వండ లేని పరిస్థితులలో ఇలా చేయడం మంచిది.
అది కూడా పరిశుభ్రమైన ప్రదేశంలో పూజ చేసి నైవేద్యం సమర్పించడం అస్సలు మర్చిపోకూడదు.
ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!