గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న 4,000 మంది భారతీయులు.. అత్యధికంగా ఆ దేశంలోనే, ఎందుకిలా..?

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.

ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.

ఇది ఈనాటిది కాదు.దశాబ్ధాల క్రితమే దీనికి బీజాలు పడ్డాయి.

అక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది నిరుపేదలే.దేశం కానీ దేశంలో పస్తులుండి, యజమాని చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ కుటుంబానికి డబ్బు పంపేవారు లక్షల్లో వున్నారు.

బ్రోకర్లు, ట్రావెల్ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి ఉన్న డబ్బులన్నీ వారి చేతుల్లో పోస్తున్నారు.

స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నకిలీ ధ్రువీకరణ పత్రాల కారణంగా చివరికి కటకటాల పాలవుతున్నారు.

అలా గల్ఫ్ దేశాల్లో దాదాపు 4000 మంది భారతీయులు మగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలకు చెందిన మీడియా తాజాగా బయటపెట్టింది.అత్యధికంగా సౌదీ అరేబియాలో 1570 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నట్లు వెల్లడించింది.

తర్వాత యూఏఈలో 1292 మంది, కువైట్‌లో 460 మంది, ఖతార్‌లో 439 మంది, బహ్రెయిన్‌లో 178 మంది, ఒమన్‌లో 49 మంది భారతీయులు ఖైదీలుగా వున్నారు.

ఇకపోతే.ప్రపంచ వ్యాప్తంగా 82 దేశాల్లో 8 వేల మంది భారతీయులు జైలు పాలైతే.

అందులో సగం మందికిపైగా ఆరు గల్ఫ్ దేశాలు, ఇరాన్ లోనే ఉన్నారని భారత ప్రభుత్వం గతేడాది మార్చిలో పార్లమెంట్‌కు తెలియజేసింది.

అమెరికాలో 267 మంది, బ్రిటన్ లో 373 మంది వుండగా.11 దేశాల్లో వంద మంది చొప్పున భారతీయులు ఖైదీలుగా ఉన్నారని కేంద్రం వెల్లడించింది.

అలాగే ఉపఖండం, మన పొరుగుదేశాల్లో దాదాపు 1,913 మంది భారతీయ ఖైదీలున్నారని కేంద్రం చెప్పింది.

అందులో అత్యధికంగా నేపాల్ లో 886 మంది ఉండగా.పాకిస్థాన్ లో 524, చైనాలో 157, బంగ్లాదేశ్ 123, భూటాన్ 91, శ్రీలంకలో 67, మయన్మార్ లో 65 మంది భారతీయులు వున్నట్లు వెల్లడించింది.

విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తున్నామని భారత ప్రభుత్వం వివరించింది.

భారత కాన్సులేట్లు, దౌత్య కార్యాలయాలు బాధితులకు సాయం చేస్తున్నాయని, అవసరమైన చోట న్యాయవాదులతో స్థానికంగా ఓ గ్రూపును ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

అఖండ సీక్వెల్ లో ఆ ఒక్క సీన్ కు పూనకాలు పక్కా.. థమన్ హామీ ఇచ్చేశారుగా!