ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తండాల్లో నాటు సారా వాసనలు

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలంలో నాటు సారా వాసన గుప్పుమంటున్న నేపథ్యంలో మంగళవారం ఆత్మకూరు (ఎస్) పోలీసులతో పాటు తుంగతుర్తి,సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా మండలంలోని కర్రోనితండా, పీపనాయక్ తండా, మంగలితండాలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో 10 లీటర్ల నాటుసారా,50 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని,నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు గౌడ్ తెలిపారు.

రాష్ట్రంలో నాటు సారా (గుడుంబా) పై నిషేధం ఉందని,నిషేధిత నాటు సారా తయారు చేసినా,విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ సోదాల్లో సూర్యాపేట ఎక్సైజ్ ఎస్సై సురేందర్ బెనర్జీ,తుంగతుర్తి ఎక్సైజ్ ఎస్సై జయప్రకాశ్, డిటిఎఫ్ ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఆ ఒక్క సినిమా మీద ఎందుకంత బజ్ ఉంది…కారణం ఏంటి..?