ఒడిస్సే E2GO ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గ్రాఫేన్ వేరియంట్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే…

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ E2GO ఎలక్ట్రిక్ స్కూటర్ కొంతకాలం క్రితం రిలీజ్ చేసినందుకు సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఇప్పుడు దానికి కొత్త వేరియంట్‌ను గ్రాఫేన్ పేరుతో విడుదల చేసింది.

గ్రాఫేన్ వేరియంట్ ధరను రూ.63,650 (ఇంట్రడక్టరీ, ఎక్స్-షోరూమ్ అహ్మదాబాద్)గా కంపెనీ నిర్ణయించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా లేదా సమీపంలోని ఆథరైజ్డ్ డీలర్ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

గ్రాఫేన్ వేరియంట్‌కు రోడ్డుపై ప్రయాణించడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

"""/" / E2GO గ్రాఫేన్ పోర్టబుల్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ఎనిమిది గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.స్కూటర్‌లో కీలెస్ ఎలక్ట్రిక్ స్టార్ట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, యాంటీ థెఫ్ట్ లాక్, డిజిటల్ స్పీడోమీటర్ ఉన్నాయి.

కంపెనీ వాహనంపై మూడేళ్ల వారంటీని కూడా అందిస్తుంది. """/" / స్కూటర్ మాట్ బ్లాక్, కంబాట్ రెడ్, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్, అజూర్ బ్లూ, కంబాట్ బ్లూ వంటి ఆరు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.

ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈఓ నెమిన్ వోరా తాజాగా మాట్లాడుతూ.గ్రాఫేన్ వేరియంట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లో ఆవిష్కరణ, నాణ్యత, అందుబాటు ధరల పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

స్థిరమైన, చైతన్యవంతమైన రవాణా విధానంతో భారతీయ రైడర్‌లకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యం అని ఆయన అన్నారు.

E2GO గ్రాఫేన్ E2GO ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌లోని నాలుగు వేరియంట్‌లలో ఒకటి.ఇతర వేరియంట్‌లలో E2GO, E2GO+, E2GO ప్రో ఉన్నాయి.

ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ హాక్, V2, V2+, ట్రోట్ అనే మూడు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా గతంలో విడుదల చేసింది.

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే!