అద్భుతం.. ఆ ఇంట్లో ఏ వస్తువు చూసినా ఆ జగన్నాథుడే..!

ఎవరిలో ఏ ప్రతిభ దాగి ఉందో చెప్పడం చాలా కష్టం.ఎందుకంటే ప్రతిభ అనేది సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది.

ప్రతి మనిషి లో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.ఎందరో వ్యక్తుల ప్రతిభ ఈ ప్రపంచానికి పరిచయం అవుతూనే ఉంటుంది.

తాజాగా ఒడిశాకు చెందిన ఒక యువతి తన ప్రతిభ తో అందిరి చేత శభాష్ అనిపించు కుంటుంది.

ఆమె బెంగుళూరులో జాబ్ చేస్తుంది.ఆమెకు పెయింటింగ్ కూడా వేసే అలవాటు ఉంది.

ఆమె ఏం చేసిందా అని అందరు అనుకుంటున్నారా.ఆమె కు పెయింటింగ్ బాగా వేసే అలవాటు ఉండడంతో ఆమె 108 వస్తువుల పై ఆ జగన్నాధుడి బొమ్మలు వేసి అందరు ఆశ్చర్య పోయే విధంగా చేసింది.

ఆ పెయింటింగ్ తో ఇప్పుడు అందరి కళ్ళు ఆమె వైపుకు తిప్పుకుంది.ఇప్పుడు ఆమె వేసిన పెయింటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ రథ యాత్ర ఈ సంవత్సరం కూడా జరగనుంది.

"""/"/ ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు మొదలు పెట్టారు.భలభద్ర, సుభద్ర సహిత జగన్నాథ్ స్వామి రథ యాత్ర కోసం యావత్ భారత దేశంలో ఉన్న భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు.

ఆ సందర్భంగా ఆమె ఏదైనా అరుదైన బొమ్మలు గీయాలని అనుకుని ఇంట్లో ఉండే చాలా వస్తువులపై జగన్నాధుడి బొమ్మలు గీసింది.

"""/"/ ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.ఆమె గీసింది పెద్ద పెద్ద వసతుల మీద కాదు.

అరటి పండు, బాదం పప్పు, కిడ్నీ బీన్స్ వంటి 108 రకాల వస్తువులపై ఆమె జగన్నాధుడి రూపాన్ని చిత్రీకరించింది.

ఈ వస్తువులన్నిటి పైన గీయడానికి ఆమె రోజు 10 నుండి 12 గంటలు శ్రమించే దానిని అని ఆమె తెలిపింది.

మీరు కూడా ఆమె గీసిన అద్బుతమైన చిత్రాలను చూసి తరించండి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?