‘మోడీ’ రూపాన్ని చెట్టుపై చెక్కిన ఒడిశా ఆర్టిస్ట్.. ఎందుకో తెలుసా..?!

భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల కూడా ఎంతో మంది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇకపోతే తాజాగా ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌ బంజ్‌ కు చెందిన ఓ కళాకారుడు తన అభిమానాన్ని నరేంద్ర మోడీకి తెలియజేసేలా తన అభిమానం కాస్తా చెట్టెక్కించాడు.

అది ఎలా అని భావిస్తున్నారా.?! అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే.

ఒడిశా రాష్ట్రానికి చెందిన సమరేంద్ర బెహరా అనే ఓ ఆర్టిస్ట్ ప్రధాని మోడీ బొమ్మను చెట్టు కాండంపై ఓ సరికొత్త ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టాడు.

ఒడిశా రాష్ట్రంలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్‌ లో ఉన్న చెట్ల పై ఆయన నరేంద్ర మోడీ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు.

అయితే అతడు ఎందుకు అలా చేస్తున్నాడు అన్న ఉద్దేశ్యం గురించి అతని అడగగా.

దాని వెనుక మంచి ఉద్దేశమే ఉంది.అయితే అది ఏంటంటే.

ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని కాపాడే చెట్లను మోడుబారేలా చేయొద్దని చెప్పేందుకే అతడు ఆ చెట్లపై మోడీ చిత్రాలని చెక్కుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

వీటితో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నరికేస్తున్న చెట్లను కూడా నరకకుండా అడ్డుకోవాలని తాను ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేసేందుకు ఇలా చేసినట్లు తెలిపాడు.

తాను చాలా చిన్న ఆర్టిస్ట్ అని, తను మోడీని కలవలేను కాబట్టి ఇలా తన ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చాడు.

"""/"/ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రశంసనీయం అని.అందుకే తాను అడవుల చెట్ల మీద ఆయన బొమ్మల ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

దీంతోపాటు మోడీ పర్యావరణ పరిరక్షణ మీద కూడా దృష్టి పెట్టాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

బెహర వేసిన నరేంద్ర మోడీ బొమ్మలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

సోషల్ మీడియాలోనూ నెటిజన్స్ అతడు చేసిన ప్రయత్నాన్ని తెగ మెచ్చుకుంటున్నారు కూడా.

జాన్వీ కపూర్ ఎంట్రీతో ఆ హీరోయిన్ కు ఆఫర్లు తగ్గాయట.. అయ్యో పాపం అంటూ?