స్కూబా డైవర్‌తో ఆడుకున్న ఆక్టోపస్.. వీడియో చూస్తే ఫిదా!

సముద్రం లోపలి ప్రపంచం చాలా అద్భుతమైనది.అక్కడ అనేక రకాల అద్భుతమైన జీవులతో మరో ప్రపంచం చూసినట్లు ఉంటుంది.

వీటిని చూస్తే అబ్బురపడక తప్పదు.సముద్రపు లోతులలో ఉన్న విచిత్రమైన జీవులలో ఆక్టోపస్ ఒకటి.

ఆక్టోపస్ వీడియో కనిపించినప్పుడల్లా ప్రజలు ఆ వీడియోకే అతుక్కుపోతుంటారు.తాజాగా ఒక స్కూబా డైవర్ చిన్న ఆక్టోపస్‌తో ఆడుతూ కనిపించాడు.

ఆ ఆక్టోపస్‌ కూడా అతనితో సరదాగా ఆడుకుంది.ఈ దృశ్యం చూసేందుకు బ్యూటిఫుల్‌గా ఉంది.

ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్‌ పేజీ షేర్ చేసింది."ఈ ఉల్లాసభరితమైన చిన్న ఆక్టోపస్ ని చివరి వరకు చూడండి" అని క్యాప్షన్ జత చేసింది.

వైరల్ వీడియో ఓపెన్ చేయగానే.స్కూబా డైవర్ తన అరచేతిని ఆక్టోపస్‌కి చూపించడం చూడవచ్చు.

ఆ తరువాత ఆక్టోపస్‌ ఆ అరచేతిలోకి వస్తుంది.డైవర్ ఆక్టోపస్ తలను అరచేతిని సరదాగా టచ్ చేస్తాడు.

ఇలా రెండు సార్లు అతను ఆ ఆక్టోపస్‌ కుక్క, పిల్లిని టచ్ చేసినట్లు తడుముతాడు.

కొంత సమయం తరువాత అది ఇక చాలు అని వెళ్ళిపోతుండగా డైవర్ తన వైపుకు పిలవడానికి దాని టెంటకిల్స్‌లో మెల్లగా లాగుతాడు.

ఆక్టోపస్ సున్నితంగా అతని చేతిని చుట్టేయడం గమనించవచ్చు.అలా వీరిద్దరూ కూడా హాయిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు.

ఈ వీడియోకి 66 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

నెటిజనులు వీడియో చూసి ఫిదా అవుతున్నారు.ఇది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ సముద్ర జీవులను ప్లాస్టిక్ భూతం నుంచి రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇంకొందరు అంటున్నారు.

సాధారణంగా ఆక్టోపస్ జీవులు మనుషులపై దాడి చేయవు.చిన్నవైతే ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాయి.

కలకత్తా పైన పంజాబ్ విజయం సాధించడానికి ఆ ఒక్క ప్లేయరే కారణమా..?