ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరైనా సహించేది లేదు: ప్రభుత్వం విప్ బీర్ల
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఏ పార్టీ వారైనా సహించేదిలేదని ప్రభుత్వ విప్ ఆలేరు,ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య( Beerla Ilaiah ) అన్నారు.
బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) ఆలేరు తహశీల్దారు కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు 59 జీవో కింద ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తహశీల్దారు విచారణ జరిపి చర్యలు తీసుకొవాలన్నారు.
లబ్ధిదారులు పేదలైతే ఏ పార్టీకి చెందినా రాజకీయాలకతీతంగా అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తామని తెలిపారు.
/br>
ఈ కార్యక్రమానికి తహశీల్దారు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఎంపిపి గందమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ( Congress Party ) రాష్ట్రనాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఎంఏ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!