నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.కోడేరులోని ప్రభుత్వ మోడల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కల్పించాయి.

పాఠశాల గేటు బయట ముగ్గులు వేసి పసుపు, కుంకుమ జల్లి పూజలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో స్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు ధైర్యం చెప్పి.దుండగుల కోసం గాలిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి10, శుక్రవారం 2025