హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం

హైదరాబాద్ నగరంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.కుల్సంపుర పరిధిలోని భరత్ నగర్ బస్తీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మృతురాలు నవ్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.కాగా నవ్య మరణంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారని చెబుతున్నారు.నిమ్మకాయలు, కొబ్బరికాయలు మరియు పసుపు, కుంకుమ ఇంటి ఎదుట పెడుతున్నారని ఆరోపించారు.

క్షుద్రపూజలకు భయపడి నవ్య బలవన్మరణం చెందిందని అంటున్నారు.దీంతో రంగంలోకి దిగిన కుల్సంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే..