విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి విధులకు ఆటంకం
TeluguStop.com
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగిస్తూ గాయపర్చిన ముగ్గురు వ్యక్తులకి 01 సంవత్సరం జైలు శిక్షతో పాటుగా ఒక్కకరికి 1000/- రూపాయల జరిమాన.
రాజన్న సిరిసిల్ల జిల్లా :విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని గాయపర్చి అతని విధులకి ఆటంక పర్చిన ముగ్గురు నిందుతులకు ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు ఒక్కక్కరికి 1000/- రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ జెఎఫ్ సీఎం మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి మంగళవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల మేరకు 2016 సంవత్సరం నందు వేములవాడ స్టేషన్ కి చెందిన శ్రీకర్ అనే కానిస్టేబుల్ జాతర గ్రౌండ్ వద్ద విధులు నిర్వర్తించుచుండగా వేములవాడ కి చెందిన ఎండీ రహిమొద్దిన్, కూసం మధు, సంటి మహేష్ అను ముగ్గురు వ్యక్తులు బండి పై ట్రిపుల్ రైడింగ్, రాష్ గా నడుపుతూ వస్తుండగా వారిని శ్రీకర్ కానిస్టేబుల్ ఆపి అలా ఎందుకు వెళ్తున్నారు అని అడుగగా వారు కానిస్టేబుల్ నీ నీకెందుకు అని తొసివేస్తూ, అతని విధులకు ఆటంక పరచినందుకు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అప్పటి వేములవాడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ముగ్గురు పై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాగా, సీఎంఎస్ ఎస్.
ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరపున ఎపీపీ విక్రాంత్ వాదించగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి గారు నిందుతులు అయిన ఎండీ రహిమొద్దిన్,కూసం మధు, సంటి మహేష్ లకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ఒక్కకరికి 1000/- రూపాయలు జరిమానా విధించినట్లు వేములవాడ పట్టణ సి.
ఐ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
హెయిర్ వాష్ కు ముందు ఈ చిట్కాను పాటిస్తే చుండ్రు అన్న మాటే అనరు!