నూజివీడులో వైసీపీకి హ్యాట్రిక్‌ ఛాన్స్‌ ఇస్తున్న టీడీపీ!

టీడీపీకి ఛాలెంజింగ్‌గా  ఉన్న నియోజకవర్గాలలో నూజివీడు ఒకటి .గతంలో కాంగ్రెస్‌‌కు పట్టున్న ఈ నియోజకవర్గం, ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్న మేక కుటుంబానికి అండంగా ఉంటుంది.

ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఐదు ఎన్నికల్లో నాలుగింటిలో ఈ కుటుంబానికి చెందిన వారే విజయం సాధించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మూడుసార్లు – 2004లో కాంగ్రెస్ నుంచి ఒకసారి, 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచారు.

2009లో ఇక్కడ ప్రతాప్ అప్పారావుపై టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది.అయితే గత ఏడాదిగా వస్తున్న సర్వే రిపోర్టులు అనుకూలంగా రావడంతో టీడీపీ ఉల్లాసంగా ఉంది  అయితే తాజా నివేదికల్లో మళ్ళీ పార్టీకి కాస్త ఇబ్బంది తప్పదనే రిసోర్ట్‌లు వస్తున్నాయి.

దీనికి గ్రూపు రాజకీయాలే కారణం తెలుస్తుంది.2014, 2019లో టీడీపీ టికెట్‌పై ఓడిపోయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు 2004లో ఒకసారి గన్నవరం నుంచి గెలుపొందారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2009లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వైఎస్‌ఆర్‌ మరణానంతరం టీడీపీలో చేరిన ఆయన సామాజిక సమీకరణాల్లో మార్పు రావడంతో నూజివీడుకు మారారు.

ప్రజాసంఘాల మద్దతు ఉన్నా, ఐక్యంగా లేకపోవడం టీడీపీకి కాస్త ప్రతి కూలంగా మారింది.

"""/"/ ముద్దరబోయిన మూడోసారి టీడీపీ నుండి టిక్కెట్‌ ఆశిస్తున్నారు.అయితే మరో నలుగురు నేతలు కూడా 2024 టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

చంద్రబాబు నాయుడు ఈ విషయం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.దీంతో ఇది టీడీపీకి ఇబ్బంది కలిగించేలా  మారుతోంది.

గ్రూపు తగదలతో నేతల మధ్య విభేదాలు నెలకోన్నాయి.  టీడీపీ అనుకూలంగా సమయంలో ఇలాంటి అంశంలో వైసీపీ అనుకూలంగా మారుతున్నాయి.

ఈ ఒక్క నియోజకవర్గం మాత్రమే కాదు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Viral Video: వైరల్ వీడియో: అభిమానం చల్లగుండా.. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..