YSRCP : వైఎస్ఆర్సీపీలో చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య..!
TeluguStop.com
ఏపీలోని వైఎస్ఆర్ సీపీ పార్ట( YSRCP )లో పలువురు నేతలు చేరుతున్నారు.ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) సమక్షంలో ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అయ్యారు.
తాజాగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య( Former MLA Chinnam Ramakotaiah ), ఆయన కుమారుడు చిన్నం చైతన్య వైఎస్ఆర్ సీపీ గూటికి చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య( Chinnam Chaitanya ) పార్టీలో చేరారు.
ఈ క్రమంలో వారిద్దరికీ సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, ఏలూరు పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్, వైఎస్‌ఆర్‌సీపీ మైలవరం నేత జ్యేష్ట శ్రీనాథ్ తో పాటు పలువురు నేతుల పాల్గొన్నారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఫోటోలు షేర్ చేస్తూ?