Nuvvu Nenu : రీ రిలీజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ నువ్వునేను మూవీ.. ప్రేక్షకాదరణ దక్కడం సాధ్యమేనా?

చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకున్న ఉదయ్ కిరణ్( Uday Kiran ) తర్వాత కాలంలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.

వేర్వేరు కారణాల వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆయన మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.

ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను సినిమా( Nuvvu Nenu ) రిలీజ్ కు సిద్ధమవుతోంది.

అయితే రీరిలీజ్ లో ఈ సినిమాకు ఆదరణ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

2001 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన నువ్వునేను మూవీ థియేటరలో విడుదలైంది.

తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్ లో సైతం స్పెషల్ మూవీగా నిలిచింది.

"""/"/ డేట్ కచ్చితంగా తెలియకపోయినా మార్చి నెలలో ఈ సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావాలని ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఉదయ్ కిరణ్ భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఉదయ్ కిరణ్ అప్పట్లోనే కోటి రూపాయల రేంజ్( Uday Kiran Remuneration ) లో రెమ్యునరేషన్ తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఉదయ్ కిరణ్ మరణం తమను ఎంతగానో బాధ పెట్టిందని ఆయనతో పని చేసిన చాలామంది సెలబ్రిటీలు చెబుతున్నారు.

"""/"/ ఉదయ్ కిరణ్ రెండో సినిమా నువ్వునేను కాగా నువ్వునేను రీరిలీజ్( Nuvvu Nenu Re Release ) అయితే ఆయన అభిమానులు కచ్చితంగా ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఉదయ్ కిరణ్ నటించిన మరిన్ని సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

ఉదయ్ కిరణ్ నువ్వునేను రీరిలీజ్ అయితే ఈ సినిమాకు ఎవరు ప్రమోషన్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

2024లో కూడా స్త్రీలను అలా బూతులు తిడుతున్నారు.. చాందిని షాకింగ్ కామెంట్స్ వైరల్!