అప్పుడు నువ్వే కావాలి.. ఇప్పుడు హనుమాన్.. ఎన్ని థియేటర్లు ఇచ్చినా ఈ సినిమాకు చాలవంటూ?
TeluguStop.com
దాదాపుగా 23 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో నువ్వే కావాలి మూవీ( Nuvve Kavali Movie ) చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
అప్పట్లో ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇచ్చినా చాలని పరిస్థితి ఏర్పడింది.తక్కువ టికెట్ రేట్లతోనే అప్పట్లో నువ్వే కావాలి సినిమా 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.
స్టార్ క్యాస్ట్ లేకుండానే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అప్పుడు నువ్వే కావాలి సినిమా ఏ విధంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ఇప్పుడు హనుమాన్ మూవీ( HanuMan Movie ) కూడా అదే విధంగా సంచలన విజయాన్ని అందుకుంది.
హిందీలో ఈ సినిమా కాంతార మూవీ( Kantara ) కలెక్షన్లను దాటేసింది.ఫుల్ రన్ లో ఈ సినిమా హిందీలో 150 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
హనుమాన్ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇచ్చినా చాలడం లేదని డిమాండ్ కు అనుగుణంగా థియేటర్లు లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ కలెక్షన్లు( HanuMan Collections ) మూడో రోజు మరింత పెరగడం గమనార్హం.
ఆదివారం రోజు ఈ సినిమాకు 18 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
హనుమాన్ సినిమాకు ఇప్పటివరకు 42 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.
"""/" /
హనుమాన్ మూవీకి ముంబై, ఇతర ప్రాంతాల్లో బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అబ్బాయిలు.. గడ్డం దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!