'నువ్వేకావాలి' హీరోయిన్ రిచా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

సాధారణంగా హీరోయిన్లకు చిత్ర పరిశ్రమలో లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు.

అయితే కొంత మంది హీరోయిన్లకు ఇలా కెరీర్ ఇంకా కాస్త తక్కువ ఉంటుందని చెప్పాలీ.

ఎందుకంటే ఒక్కసారిగా హిట్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.

అలాంటి హీరోయిన్లలో నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా మల్లాడ్ కూడా ఒకరు.ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1980 ఆగస్టు 30 వ తేదీన పుట్టారు రీఛా.అయితే సినిమాల మీద ఆసక్తితో అటు వైపు అడుగులు వేశారు.

హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో నటించారు.అంతేకాదు 200కు పైగా యాడ్ ఫిలింస్ లో కూడా నటించారు.

ఇక తెలుగులో నువ్వేకావాలి సినిమా లో ఒకసారి ఒక వెలుగు వెలిగింది.తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే అవకాశాలు రాక కనుమరుగయ్యింది.

2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.2013లో వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.

2016 లో మలుపు అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంది ఈ హీరోయిన్.

"""/"/ కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఇక ఆ తర్వాత పూర్తిగా నటిగా చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది.

అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడికి సంబంధించిన భర్త పిల్లలకు సంబంధించిన పర్సనల్ విషయాలు మాత్రం ఎక్కడా సోషల్ మీడియాలో దొరకవు అని చెప్పాలి.

అందుకే ఇప్పటికి కూడా రీచా పెళ్లి ఒక మిస్టరీగానే ఉంది.ఇక ఇప్పుడు 41 ఏళ్ల వయసులో ఉన్న ఈ హీరోయిన్ నటిగా రాణించక పోయినప్పటికీ అటు బాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రం సక్సెస్ అయింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో విడుదల అవుతున్న చాలా సినిమాలకు రిచా డబ్బింగ్ చెబుతూ ఉండటం గమనార్హం.

అంతే కాకుండా తన భర్తకు హెల్ప్ చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఎంతో హాయిగా గడుపుతుందట రీఛా.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?