ప్రపంచంలోనే అతి పెద్ద ఆస్ట్రిచ్ గుడ్డు.. ఈ గుడ్డు వల్ల ఎన్ని పోషకాలంటే..!

ప్రస్తుతము భూమి మీద ఎన్నో వేల రకాల పక్షులు నివసిస్తున్నాయి.పక్షులు పెట్టే గుడ్లలో కృష్ణ పక్షి గుడ్డే చాలా పెద్దది.

తెలుగులో ఉష్ణ పక్షిని నిప్పుకోడి అని కూడా అంటారు.ఈ ఉష్ణ పక్షి ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రిచ్ పక్షిగా ప్రసిద్ధి గాంచినది.

ముఖ్యంగా దీని యొక్క నివాసము ఆఫ్రికా ఖండము.ఈ పక్షి ఔడ్ షూర్న్ అనే పట్టణంలో ఎక్కువగా కనిపిస్తుంది.

అందుకే ఈ పట్టణము ప్రపంచ ఆస్ట్రిచ్ రాజధానిగా ప్రసిద్ధి గాంచినది.ఉష్ణ పక్షి ఎగరలేని పక్షి జాతులలో అతి పెద్దది.

ఈ పక్షి బల్లులు, మిడతలు, పాములు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది.దీనితో పాటు ఎక్కువగా విత్తనాలు, ఆకుల వంటి వృక్షసంపద చెందిన ఆహారము తినడానికి కూడా ఇష్టపడుతుంది.

తాను పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఆహారము అరగడం కోసము ఇసుకలో తలపెట్టి ఇసుక, గులకరాళ్లు తిని ఆహారాన్ని అరిగించుకుంటుంది.

శత్రువులు తరిమితే అవి సాధారణంగా పారిపోతాయి.కానీ ఒక్కోసారి నేలపై అడ్డంగా పండుకుంటాయి.

శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు బలమైన కాళ్లతో తన్ని గాయపరుస్తుంది.ఈ పక్షికి చర్మము మందంగా కలిగి ఉంది.

కృష్ణ పక్షి మాంసానికి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది.ఆస్ట్రిచ్ గుడ్డు చాలా భారీగా ఉంటుంది.

దీనిని పగల కొట్టాలంటే కూడా చాలా కష్టము.ఒక్క గుడ్డు తో చేసిన వంటకాన్ని దాదాపు 15 మంది వరకు తినవచ్చును.

సుమారు ఈ పక్షి గుడ్డు రెండు కిలోల బరువు ఉంటుంది. """/"/ ఈ గుడ్డును ఉడికించాలన్న దాదాపు గంటన్నర సమయం పడుతుంది.

ఇందులో కోడిగుడ్డు కంటే ఎక్కువ స్థాయిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఏ కలిగి ఉంటాయి.

కొవ్వు పదార్థాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి.ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం అని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క ఉష్ణ పక్షి గుడ్డు లో సుమారు 2000 కేలరీలు, 100 గ్రాముల కొవ్వు , 235 గ్రాముల ప్రోటీన్లు ఉన్నాయి.

28 కోడి గుడ్లు ఎంత బరువు ఉంటాయో కృష్ణ పక్షి గుడ్డు అంత బరువు ఉంటుంది.

అయితే ఈ మధ్య కాలంలో సారారైనీ అనే ఒక మహిళ ఉష్ణ పక్షి గుడ్డు తో రకరకాల వంటకాలు తయారు చేస్తూ భోజన ప్రియులను అలరిస్తున్నది.

లండన్ లోని ఓ రెస్టారెంట్లో ఉదయము అల్పాహారంగా ఈ గుడ్డు తో చేసిన వంటకాలను ఉంచుతారు.

ఉష్ణ పక్షి చర్మము కొన్ని ఉత్పాదనలో కూడా వినియోగిస్తారు.ఉష్ణ పక్షి మాంసానికి మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంది.

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ?