మొటిమలను సులువుగా నివారించే జాజికాయ.. ఎలాగంటే?
TeluguStop.com
మొటిమలు.చాలా మంది యువతీ, యువకులను ఇబ్బంది పెట్టే చర్మ సమస్య ఇది.
ఈ మొటిమలు వచ్చాయంటే చాలు.వాటిని ఎలా తగ్గించుకోవాలా అని తెగ హైరానా పడి పోతుంటారు.
ఈ క్రమంలోనే ఏవేవో క్రీములు రాస్తుంటారు.కానీ, ఫలితం లేక బాధపడుతుంటారు.
అయితే మొటిమలను తగ్గించడంలో జాజికాయ అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా జాజికాయను వంటల్లో రుచి, వాసన కోసం తరచూ వాడుతుంటారన్న సంగతి తెలిసిందే.
అయితే జాజికాయ మొటిమలను సులువుగా తగ్గించడంలోనూ.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
మరి జాజికాయను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని జాజికాయలను తీసుకొని పొడి చేసి పెట్టుకొవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.
అందులో అర టీ స్పూన్ జాజికాయ పొడి, పావు టీ స్నూన్ చందనం పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.పది నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొటిమలతో పాటు నల్ల మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ జాజికాయ పొడి మరియు అర టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు వదిలేయాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చర్మంపై మృత కణాలు పోయి.
ముఖం అందంగా, ప్రకాశవంతంగా మారుతుంది.మూడోవది.
ఒక బౌల్లో కొద్దిగా జాజికాయ పొడి మరియు పాలు వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.కాసేపు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముడతలు పోయి.
ముఖం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.
పుష్ప2 మూవీ వల్ల ట్రాఫిక్ జామ్.. ఇతర రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా!