మతిమరుపును నివారించే జాజికాయ‌.. ఎలా తీసుకోవాలంటే?

మ‌తిమ‌రుపు.పూర్వం వృద్ధాప్యంలో వ‌చ్చే ఈ స‌మ‌స్య నేటి కాలంలో ముప్పై ఏళ్ల‌కే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే తమకు మతిమరుపు ఉందన్న విషయమే చాలా మంది గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.ఫ‌లితంగా జ్ఞాపకశక్తి సన్నగిల్ల‌డం అనేది తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.

దాంతో అనేక ఇబ్బందుల‌ను ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది.మెద‌డు ప‌ని తీరు మంద‌గించ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఒక‌వేళ మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌ను ముందుగానే గ్ర‌హించి.త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే జ్ఞాపకశక్తి లోపించే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

ముఖ్యంగా ప‌లు ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌ను సులువుగా నివారించుకోవ‌చ్చు.అలాంటి ఆహారాల్లో జాజికాయ ఒక‌టి.

పురాతన కాలం నుంచి అనేక వంట‌కాల్లో, ఆయుర్వేదంలో జాజికాయల‌‌ను ఉప‌యోగిస్తున్నారు.ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం, కాల్షియం వంటి మిన‌ర‌ల్స్‌తో పాటు ప‌లు ర‌కాల విట‌మిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా జాజికాయలో పుష్క‌లంగా ఉంటాయి.

అటువంటి జాజికాయ మ‌తిప‌రుపును నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది. """/"/ మ‌రి జాజికాయ‌ను ఎలా తీసుకుంటే.

మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో అర స్పూన్ జాజికాయ పొడిని క‌లుపుకుని తీసుకోవాలి.

లేదంటే అర స్పూన్ జాజికాయ పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జాజికాయలో ఉండే మినిస్టిసిన్ అనే పదార్థం మెదడు ప‌ని తీరును మెరుగు ప‌రిచి మతిమరుపు స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

అదే స‌మ‌యంలో అల్జీమర్స్ తాలూకు లక్షణాలను కూడా త‌గ్గిస్తుంది.ఇక జాజికాయ‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

గుండె జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలోనూ, కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలోనూ, అధిక రక్తపోటును అదుపు చేయ‌డంలోనూ, శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డంలోనూ జాజికాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, జాజికాయ‌ పొడిని వంట‌ల్లో త‌ర‌చూ వాడ‌టం ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే…