బీజేపీ నుంచి నుపుర్ సస్పెన్సన్..?

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు.

ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి.

అయితే తాను సొంతంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని నుపుర్ స్పష్టం చేశారు.పుస్తకాలు ఉన్నది, ఇస్లామిక్ పండితులు చెప్పిందే తాను ప్రస్తావించానని వివరణ ఇచ్చినా దుమారం ఆగలేదు.

దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.ఇంతకీ నుపుర్ మీద పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతోంది.

ఒక మాట ప్రపంచాన్ని కుదిపేయవచ్చు.ఒక చర్య ఎంతో రక్తపాతానికి దారి తీయవచ్చు.

రాజకీయాల్లో, పరిపాలనలో రాజధర్మం వేరు, రాజనీతి వేరు.అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది.

రాజ ధర్మాన్ని పాటించి రాముడు వనవాసం చేశాడు.పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు.

రాజు ఆదేశాన్ని పాటించి సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది.రాజనీతిని అనుసరించి కురుక్షేత్రంలో పాండవులు గురువును, గురు పుత్రుడిని, తాతను కూడా సంహరించారు.

రాజు ధర్మాన్ని అనుసరించి ఏది చేసినా న్యాయమే.అలాగే రాజనీతిని అనుసరించి ఏ నిర్ణయం తీసుకున్నా ధర్మమే.

పురాణ కాలం నుంచి భారత దేశంలో నడుస్తున్న ధర్మం, రాజనీతి ఇవే. """/"/ నుపుర్ శర్మ ఉన్నత విద్యావంతురాలు.

మంచి వాగ్ధాటి ఉన్న నేత.భారతీయ జనతాపార్టీకి ఒక విలువైన కార్యకర్త.

ఢిల్లీలో జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నుపుర్ ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చర్చలో భాగంగా మహ్మద్ ప్రవక్త మీద కామెంట్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో దేశంలో అగ్గి రాజుకుంది.ఇస్లామిక్ దేశాలు ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా కారాలు మిరాయాలు నూరాయి.

తమ దేశాల్లోని భారత రాయబారులను పిలిచి అవమానం జరిగిపోయిందని, దేశం క్షమాపణలు చెప్పాలని అడిగాయి.

కొన్ని సమయాల్లో రాజధర్మం పాటించాల్సిందే.అందుకే వివాదం మరీ ముదిరి దేశానికి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా నుపుర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ పెద్దలు.

అంతకుముందే నుపుర్ కూడా తన వల్ల పార్టీకి, దేశానికి చిక్కులు రాకూడదని తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.

వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మేక‌ప్ అక్క‌ర్లేదు.. స‌హ‌జ అందం కోసం ఈ ఇంటి చిట్కాను పాటించండి!