సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్ననుపుర్ వ్యాఖ్యలు..

నుపుర్ శర్మకు హిందూ సంఘాలన్నీ మద్దతుగా నిలిచాయి.ఆమె చెప్పినదానిలో ఎలాంటి తప్పూ లేదని పైగా నుపుర్ సొంతంగా తన అభిప్రాయాలు చెప్పలేదని కూడా వివరించాయి.

ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో నుపుర్ శర్మ కూడా చెప్పారు.తాను డిబేట్ లో భాగంగా ప్రవక్త గురించి ఇస్లామిక్ పండితుడు జకీర్ నాయక్ చెప్పిన మాటల్నే ఉదహరించారని నుపుర్ తెలిపారు.

తాను చెప్పినవాటిని ఎడిట్ చేసి కొన్ని మాటలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దాని వల్లనే ఇంత దుమారం రేగిందని వివరించారు.

నుపుర్ శర్మకు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పయితే మత గ్రంథాల్లో రాసింది, జకీర్ నాయక్ చెప్పింది తప్పేగా అని ప్రశ్నించారామె.

గతంలో ప్రజ్ఞా ఠాకూర్ మీద కూడా బీజేపీ చర్యలు తీసుకుంది.విద్యార్థి పరిషత్ నుంచి ఎదిగిన ప్రజ్ఞా ఠాకూర్ యూత్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.

నాథూరాం గాడ్సేను దేశ భక్తుడు అన్నందుకు ప్రతిపక్షాలు ఆమెపై దుమ్మెత్తి పోసాయి.దీంతో భోపాల్ ఎంపీగా ఉన్న ప్రజ్ఞా ఠాకూర్ ను రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ నుంచి తొలగించారు.

బీజేపీ పార్లమెంటరీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా చర్యలు తీసుకున్నారు.రాజధర్మంలో ఇవన్నీ తప్పని సరి చర్యలు.

కొన్ని వ్యాఖ్యలు సమాజంలో విమర్శలకు తావిచ్చినపుడు చర్యలు తప్పవు.అసలు నుపుర్ శర్మ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నిటా అప్పటి డిబేట్ వీడియోలు తొలగించారు.అయితే ఒక్కటి మాత్రం నుపుర్ స్పష్టం చేశారు.

"""/"/ తన మాటల్ని వాళ్ల అవసరానికి అనుగుణంగా ఎడిట్ చేసి ప్రచారం చేశారని, తాను మాత్రం జకీర్ నాయక్ చెప్పినవి, వారి గ్రంథాల్లో ఉన్నవి మాత్రమే చెప్పానని స్సష్టం చేశారు.

నుపుర్ అన్న మాటలు వివాదం చేశారు.మరి జకీర్ నాయక్ చెప్పిన మాటలు ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

వాటిని ఎందుకు ఖండించరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.పార్టీ అధినాయకత్వం నుపుర్ మీద చర్యలు తీసుకున్నప్పటికీ పార్టీ శ్రేణులన్నీ ఆమెకు మద్దతుగా నిలిచాయి.

మంచి వాగ్ధాటి ఉన్న నాయకురాలిని బీజేపీ దూరం చేసుకోవడం సరికాదని అంటున్నాయి.ఇటువంటి నేతలు భారత సమాజానికి అవసరమని, అందువల్ల త్వరలోనే పరిణామాలు నుపుర్ శర్మకు అనుకూలంగా మారతాయని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

స్టార్‌బక్స్ సంచలన నిర్ణయం.. భారత సంతతి సీఈవో లక్ష్మణ్ నరసింహన్‌కు ఉద్వాసన, ఎందుకిలా..?