ఈ సంవత్సరంలో ఈ తేదీల్లో పుట్టిన వారికి.. పట్టిందల్లా బంగారం..?
TeluguStop.com
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాదిరిగా న్యూమరాలజీకి( Numerology ) కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది.
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేది( Birth Date ) ఆధారంగా వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను వెల్లడిస్తారు.
తాజాగా న్యూమరాలజిస్టులు కీలక విషయాలని చెబుతున్నారు.న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27వ తేదీలలో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 9.
ఈ సంఖ్య ధైర్యానికి ప్రతీకగా పేర్కొంటారు.ఇక 9 కి పాలకుడు అంగారకుడు.
ఈ అంగారక గ్రహం ప్రభావం కారణంగా రాడిక్స్ సంఖ్య 9( Radix Number 9 ) ఉన్న వ్యక్తులు శక్తివంతంగా అలాగే ధైర్యంగా ఉంటారు.
జాతకంలో 9 ఉన్న వారి భవిష్యత్తు ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సంవత్సరం అంతా కూడా వారికి అదృష్టం( Luck ) వరుస్తుందని కూడా చెబుతున్నారు.
దీంతో వీరికి ఏ పని చేసినా కూడా ఫలితం ఉంటుంది.అలాగే విదేశాలకు ( Foreign ) వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది.
అలాగే ఇది ఉన్నత విద్యకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.అంతేకాకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు( New Opportunities ) లభిస్తాయి.
ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. """/" /
ఈ సంవత్సరంలో జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.
ఇక ఇవి సరి కావడానికి కొంత సమయం పడుతుంది.అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి(
Health ) కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది.అలాగే దగ్గు ఇబ్బంది కలిగిస్తుంది.
కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.ఇక పిల్లల చదువుకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది.
పిల్లలకు సంబంధించిన శుభవార్తలు కూడా అందుకుంటారు.అలాగే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు.
విద్య( Education ) మొదలైన వాటికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
"""/" /
కాబట్టి మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.ఈ సంవత్సరంలో కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.
దీంతో మీకు విజయం లభిస్తుంది.ఇక మీ కెరీర్ బదిలీ పొందే అవకాశం కూడా ఉంది.
అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు( Promotions ) కూడా అందుకుంటారు.ఇక చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
వ్యాపారులు, అదనపు ప్రయత్నం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు.వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
ఇక ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం గొప్ప విజయాన్ని ఇస్తుంది.