ఏడు సంఖ్య దురదృష్టానికి సంకేతమా..?

ఏడు నంబర్ వస్తే చాలు చాలా మంది దురదృష్టానికి సంకేతం అనుకుంటారు. ఏదో చెడు జరుగుతుందనే అనుమానంతో ఉంటారు.

 కానీ సంఖ్యల్లో ఏం ఉండదు. అంతా మనం చేసే మంచి పనుల్లోనే ఉంటుంది.

 మనం చేసే మంచి పనులే మనకు అదృష్టాన్ని కల్గజేస్తాయి అనడానికి. ఏడు సంఖ్య దురదృష్టం కాదు అనడానికి ఇదే నిదర్శనం కావాలంటే చూడండి.

కోరిన కోర్కెలు తీర్చే ఆ తిరుపతి వెంకటేశ్వరుని కొండలు. ఏడు ప్రతి రోజూ ఉదయం మనం చూసే సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాలు కూడా ఏడే.

 అలాగే పాతాళం కింద ఉండే లోకాలు ఏడే. భువర్లోకాలు కూడా ఏడే.

 ద్వీపాలు కూడా ఏడే. అలాగే పెళ్లిలో వధూవరులిద్దరూ కలిసి వేసే అడుగులు ఏడే.

 అంతే కాదండోయ్. అగ్ని దేవుని నాలుకలు ఏడు.

 బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడో నెలలోనే. సప్త స్వర్గాలు కూడా ఏడే.

సంఖ్య మంచిది కాదనేది కొందరి మూఢ నమ్మకం.7 సంఖ్య కూడా మంచిదే.

 భగవంతుడు సృష్టించే ప్రతీది మన కోసమే. వాటిని ఉపయోగించే పద్ధతుల వల్లే మనకు ఫలితం లభిస్తుంది.

 అందుకే ఎవరికీ నష్టం జరగకుండా మనం మంచి పనులు చేస్తే. కచ్చితంగా మనకు మంచే జరుగుతుంది.

 ఒకవేళ చెడు జరిగినా. రాబోయే కాలంలో అయినా ఆ దేవుడు మనకు మంచే చేస్తాడు.

అందుకే మనకు వీలైనంత వరకు అందరికీ మంచే చేయాలి.అప్పుడే మనం మన పిల్లలు సంతోషంగా జీవిస్తారు.

వైఎస్ఆర్‎సీపీలో వైఎస్ఆర్ లేడు..: షర్మిల