చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ సైలెన్స్ ! కారణం ఇదేనా ?
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ , చంద్రబాబు( Chandeababu ) వ్యవహారాలపై ఏ ప్రస్తావన వచ్చినా, ఏదో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
చాలా కాలంగా టిడిపి కార్యక్రమాలకు, చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు .
పూర్తిగా సినిమా వ్యవహారాల్లోని బిజీగా ఉంటున్నారు .అయితే రెండు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లారు.
అయితే ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులు అంతా దాదాపుగా స్పందించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపినా, జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం, టిడిపి నేతలు అనేక విమర్శలు చేశారు.
ముఖ్యంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు( Prathipati Pullarao ) జూనియర్ ఎన్టీఆర్ బతికున్నాడా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా , జూనియర్ ఎన్టీఆర్>( Jr Ntr ) మాత్రం బహిరంగంగా స్పందించలేదు.
కనీసం సోషల్ మీడియా ద్వారా అరెస్టు వ్యవహారాన్ని ఖండించకపోవడం పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
"""/" /
చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీదే ఉంది.
నంద్యాలలో ఆయన అరెస్టు చేసి విజయవాడ తరలించి, ఆ తర్వాత రాజమండ్రి జైలుకు పంపించే వరకు పెద్ద హడావుడిని జరిగింది.
ఆ సమయంలో నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి లకు సంఘీభావంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వెళ్లారు.
బాలకృష్ణ,( Balakrishna ) రామకృష్ణ తో పాటు మరికొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లి ధైర్యం చెప్పారు .
అయితే అదే నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్>( Jr Ntr ) స్పందించకపోవడంపై పెద్ద రచ్చే జరుగుతుంది.
ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు . ఎన్టీఆర్ సినిమా షూటింగ్ హైదరాబాదు లోనే జరుగుతోంది.
కనీసం చంద్రబాబు అరెస్టుపై చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చే తీరిక లేదా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు .
"""/" /
ఇటీవల ఢిల్లీలో దివంగత ఎన్టీఆర్( NTR ) బొమ్మతో వంద రూపాయల నాణేన్ని కేంద్రం విడుదల చేసింది.
ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా హాజరైనా , జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరంగానే ఉన్నారు.
తర్వాత ఈ విషయంపై కనీసం ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు.అయితే చంద్రబాబుతో కలిసి ఏ వేదిక పంచుకునేందుకు, ఆయన హాజరయ్యే కార్యక్రమానికి వెళ్లేందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలాకాలంగా ఇష్టపడడం లేదని, ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మరింత దూరం పెరిగిందనే ప్రచారానికి బలం చేకూరింది.
రాజకీయ చంద్రబాబుకు టిడిపికి ఉపయోగపడే ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదు అని జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) నిర్ణయించుకోవడంతోనే అరెస్టు వ్యవహారంపై స్పందించలేదని, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అక్క నందమూరి సుహాసిని ఇంట్లో శుభకార్యానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
అక్కడ కు చంద్రబాబు కుటుంబంతో సహా హాజరైనా, అక్కడ ఒకరికొకరు పలకరింపులు లేవని, అంతకుముందు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరు ప్రస్తావించి వైసిపి నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా, జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టిడిపి నాయకులు విమర్శలు చేశారు .
ఎక్కడా భువనేశ్వరి పేరు ఎత్తకుండా జనరలైజ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు.ఇప్పుడు చంద్రబాబు విషయంలో పూర్తిగా సైలెంట్ గా ఉండడానికి కూడా ఆ పాత కారణాలే కారణమట.
ప్రశాంత్ నీల్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటున్న నెటిజన్లు…ఇంతకీ ఈ సినిమా..