ఘనంగా ఎన్టీఆర్ బావమరిది నితిన్ నిశ్చితార్థం..పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
TeluguStop.com
హీరో నార్నే నితిన్.( Hero Narne Nitin ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
నితిన్ ఎన్టీఆర్ బామ్మర్ది అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇకపోతే ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చి మ్యాడ్( Mad Movie ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను సాధించాడు నార్నే నితిన్.బావ పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఎటువంటి సహాయం తీసుకోకుండా ఇవ్వడంతో పాటు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను సాధించాడు.
నితిన్ కి కూడా మంచి నటుడిగా తొలిసినిమా తోనే పేరొచ్చింది. """/" /
ఈ చిత్రం తర్వాత ఆయన హీరోగా నటించిన రెండవ సినిమా ఆయ్( Aay Movie ) కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆరంభంలోనే యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకునే దిశగా నార్నే నితిన్ అడుగులు వేస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా నార్నే నితిన్ ఎంగేజ్మెంట్( Narne Nitin Engagement ) వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు బావ ఎన్టీఆర్( NTR ) అక్క లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) అలాగే ఎన్టీఆర్ పిల్లలు హాజరయ్యారు.
నితిన్ ఎంగేజ్మెంట్ హైదరాబాదులో శివాని( Shivani ) అనే అమ్మాయితో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది.
కదా వధువు నెల్లూరు జిల్లాకు చెందిన శివాని ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కుటుంబానికి దగ్గర బంధువులట.
"""/" /
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట, ఎట్టకేలకు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఈ నిశ్చితార్ధ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, విక్టరీ వెంకటేష్ కుటుంబంతో పాటు నితిన్ కి ఇండస్ట్రీ లో క్లోజ్ గా ఉండే కొంతమంది యంగ్ హీరోలు కూడా ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది.
అలాగే నితిన్ తండ్రి రాజకీయ నాయకుడు అవ్వడంతో, పలువురు ముఖ్య రాజకీయ నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
పెళ్లి వేడుక వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బామ్మర్ది ఎంగేజ్మెంట్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచాడు.
ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?