Teja : ఎన్టీఆర్ బయోపిక్ వెబ్ సిరీస్ గా చేయాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన తేజ!

మనసులో ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడే డైరెక్టర్లలో డైరెక్టర్ తేజ( Director Teja ) ఒకరు.

ఈయన ఏ విషయమైనా తనకు తోచినది నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు.ఇక తేజ చాలా రోజుల తర్వాత అహింస( Ahimsa ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు.

"""/" / ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్( Ntr Biopic ) చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా ఈ సినిమా చేయాలన్న ఉద్దేశంతో ముహూర్తం షార్ట్ కూడా ప్రారంభించి అనంతరం ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే బాలకృష్ణ ( Balakrishna ) తో విభేదాల కారణంగానే ఈ సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా గురించి మరోసారి తేజ స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ముందుగా తనకు బాలకృష్ణ గారితో ఏవిధమైనటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

"""/" / ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా గురించి తేజ మాట్లాడుతూ.

గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఉంది.అలాంటి ఒక మహనీయుడు బయోపిక్ సినిమా చేసే సత్తా తనకు లేదని అందుకే తాను తప్పుకున్నానని తెలిపారు.

కానీ ఎప్పటికైనా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ఈ సందర్భంగా తేజ తెలియజేశారు.అయితే ఈ బయోపిక్ సినిమాల కాకుండా వెబ్ సిరీస్ ( Web Series ) గా చేస్తానని అందులో కూడా తారక్ ( Tarak ) హీరోగా అయితేనే చేస్తాను అంటూ ఈ సందర్భంగా తేజ ఎన్టీఆర్ బయోపిక్ గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా అందులో ఎవరు నటించాలి అన్న విషయాన్ని కూడా వెల్లడించారు.

ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అభిమానానికి జోహార్.. నేతాజీ ఆకారంలో 913 కి.మీ. రూట్ మ్యాప్..