ఎన్టీఆర్ వండర్ కిడ్… తనని ఎప్పుడూ అలా చూడలేదు: శుభలేఖ సుధాకర్
TeluguStop.com
నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ (NTR)ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ (Oscar)అవార్డు రావడంతో తారక్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.
ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
"""/" /
ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు ఎన్టీఆర్ నటన తన డాన్సుల గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే నటుడు శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) గతంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈయన ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా సమయంలో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
"""/" /
ఈ వీడియోలో భాగంగా శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను వండర్ కిడ్ (Wonder Kid)అంటూ ప్రశంసించారు.
షూటింగ్ లొకేషన్ లో ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా ఉండే ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా పేపర్ పట్టుకుని డైలాగులు చదవడం తాను చూడలేదని తెలిపారు.
మరి ఆయన ఎప్పుడు చదువుతాడో ఏమో తెలియదు కానీ టేక్ అనగానే మూడు నాలుగు పేజీల డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ (Single Take)లో చెప్పే టాలెంట్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్.
ఇలా ఎన్టీఆర్ ను కనుక చూస్తే ఆయన కెమెరా కోసమే పుట్టారని సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, కసి, కృషి వల్లే ఇదంతా సాధ్యమవుతుందేమోనని ఈయన తెలిపారు.
తారక్ గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన వండర్ కిడ్ అంటూ ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి.. వాటిని ఆపడం ఎలా..?