Jr NTR : ఆ విషయంలో కళ్యాణ్ రామ్ కు సారీ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ( Jr.NTR Kalyan Ram )ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.కళ్యాణ్ రామ్ కూడా ఒక వైపు హీరోగా సినిమాలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
ఇలా ఎవరికివారు ఇద్దరూ కెరియర్ పరంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
"""/" /
కొన్ని వార్తలు నెగిటివ్గా వినిపిస్తుండగా మరికొన్ని పాజిటివ్గా వినిపిస్తున్నాయి.గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలి అనుకునేలా కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ల మధ్యన అనుబంధం కనిపిస్తుంది.
వీరిద్దరూ కలిసికట్టుగా నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగా కనిపిస్తున్నారు.నందమూరి కుటుంబాన్ని పక్కనబెట్టి మరీ తమ్ముడి కోసం కళ్యాణ్ రామ్ నిలబడుతున్నాడు.
అటు ఎన్టీఆర్ కూడా అన్న కోసం చెయ్యాల్సింది చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ సినిమాలకి ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కి వచ్చి అన్న సినిమాలకి క్రేజ్ తెస్తున్నాడు.
"""/" /
బింబిసార, అమిగోస్ ఇలా ప్రతి సినిమాకి ఎన్టీఆర్ అన్న కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు.
కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ ( Devil )ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాలు పంచుకోలేకపోతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఫాన్స్ ముందుకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు.కానీ ఎన్టీఆర్ డెవిల్ ఈవెంట్స్ కి రావడం లేదని తెలుస్తోంది.
కారణం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో క్రిష్ట్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది.
సెలబ్రిటీస్ లో చాలామంది న్యూ ఇయర్ వేడుకల కోసం ఏదో ఒక దేశాన్ని ఎంచుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉంటారు.
ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో పాటుగా అమెరికాలో న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
అదే విధంగా ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ ని అలానే ప్లాన్ చేసుకోవడంతో ఎన్టీఆర్ డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్( Devil Pre Release Event ) కి రాలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
మలయాళ స్టార్ హీరోతో సినిమా చేయనున్న సంచలన దర్శకుడు…