ఆర్ఆర్ఆర్ దెబ్బకు వెనకబడ్డ మరో క్రేజీ ప్రాజెక్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేశాడు తారక్.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్‌ కావడంతోనే మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది సెకండాఫ్‌లో ప్రారంభించి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని తొలుత అనుకున్నారు.

కాగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏకంగా జనవరి 8, 2021కు వాయిదా వేయడంతో త్రివిక్రమ్‌-తారక్ సినిమా కూడా వాయిదా పడింది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరంలో ప్రారంభించాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్.దీనికి తోడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కథ కోసం సమయం కావాలని కోరాడట.

అటు తారక్ కూడా ఆర్ఆర్ఆర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఇప్పట్లో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే ప్రసక్తి లేదంటున్నారు సినీ వర్గాలు.

ఈ సినిమాను 2021 సెకండాఫ్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

ఒక్క సీన్ తోనే 1000 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్న టాలీవుడ్ చిత్రాలు ఇవే !