బాలయ్యకు ఎన్టీఆర్ పెట్టిన మూడు కండీషన్లు ఏంటో తెలుసా?
TeluguStop.com

ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన బాలయ్య.తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించాడు.


అలాంటి సినిమాల్లో ఒకటి మంగమ్మ గారి మనువడు.ఈ సినిమా బాలయ్యకు ఎంతో గుర్తింపు తెచ్చింది.


ఈ సినిమాను తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ చేశారు.మన్ మాసనై అనే సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది.
ఈ సినిమాను తెలుగులో బాలయ్య హీరోగా మంగమ్మ గారి మనువడు పేరుతో రీమేక్ చేశారు.
అయితే ఈ సినిమాలో కీలకమైన మంగమ్మ క్యారెక్టర్ ను దిగ్గజ నటీమణి భానుమతితో చేయించాలి అని ఎన్టీఆర్ భావించాడు.
ఆమె నో చెప్తే సినిమానే చేయకూడదు అనే అభిప్రాయంలో ఉన్నాడు ఎన్టీఆర్.ఈ సినిమాలో నటించాల్సిందాగా ఎన్టీఆర్ స్వయంగా భానుమతికి కాల్ చేశాడు.
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఫోన్ చేసి అడగడంతో భానుమతి సరే అని చెప్పింది.
అయితే ఈ సినిమా చేయబోయే ముందు బాలయ్యకు ఎన్టీఆర్ ప్రధానంగా మూడు కండీషన్లు పెట్టాడు.
అందులో ప్రధానంగా.భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే బాలయ్య అక్కడ ఉండాలని చెప్పాడు.
అంతేకాదు.తను కారు దిగేందుకు బాలయ్యే స్వయంగా కారు డోరు తీయాలని చెప్పాడు.
ఆమె కారు దిగగానే కాళ్లకు నమస్కరించాలని చెప్పాడు. """/"/
ఎన్టీఆర్ పెట్టిన ఈ మూడు కండీషన్లను కచ్చితంగా పాటించాలని బాలయ్యకు చెప్పాడు.
అయితే తండ్రి చెప్పిన నిబంధనలన్నీ పాటించేందుకు ఓకే చెప్పాడు బాలయ్య.సినిమా షూటింగ్ మొదలు కొని చివరి వరకు ఈ కండీషన్లను తూచ తప్పకుండా పాటించాడు.
సినిమా పూర్తయ్యాక బాలయ్య తీరు పట్ల భానుమతి చాలా సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అంతేకాదు.ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మంచి విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
తను చెప్పినట్లుగానే సినిమా విడుదలై.బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
తన కెరీర్ లోనే మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ కాకి ఏంటి ఇలా అరుస్తుంది.. వీడియో వైరల్