బామ్మర్ది విషయం లో స్పెషల్ కేర్ తీసుకుంటున్న ఎన్టీయార్…

సినిమా ఇండస్ట్రీ లోకి ఒకరు వచ్చారు అంటే చాలు వాళ్ళతో పాటు వాళ్ల బందువులు అన్న లు తమ్ముళ్లు అందరూ వచ్చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీల వారసులే కాదు వారి సన్నిహితులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన బామ్మర్ది నార్నే నితిన్ ను హీరోగా ఈసారి చాలా పగడ్బందీగా లాంఛ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్టీఆర్.

ఇప్పటికే నార్నే నితిన్ శ్రీశ్రీశ్రీ రాజా వారు( Sri Sri Sri Raja Vaaru ) అనే సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే.

శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

అంతేకాదు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.అయితే మూడు సంవత్సరాలు అయినా సరే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు.

దీంతో మొదటి సినిమానే ఇలా అయ్యిందేంటి అంటూ అటు మీడియా వర్గాలు ఇటు సోషల్ సర్కిల్స్ లో కూడా నార్నే నితిన్( Narne Nithin ) పై జాలి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

"""/" / అందుకే ఇటువంటి సమయంలోనే నార్నే నితిన్ హీరోగా మరొక సినిమాను ప్రకటించడానికి గీత ఆర్ట్స్ వారు సిద్ధం అవుతున్నారు.

బన్నీ వాసు నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నార్నే నితిన్ సినిమా ఉండబోతుందని అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం.

అయితే ఏ క్షణంలో అయినా సరే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు నార్నే వారి సొంత బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని మొదట భావించినప్పటికీ కూడా గీత వారి పేరు ఉంటే సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"""/" / ఇకపోతే యంగ్ డైరెక్టర్ అని ప్రకటించారు కానీ ఎవరు డైరెక్టర్గా వస్తారన్నది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) తమ్ముడి కోసం ఎన్టీఆర్ బాగానే కష్టపడుతున్నారని సమాచారం.

ఇక త్వరలోనే హీరోయిన్ గురించి అలాగే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాతో తన బామ్మర్ది ని ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోగా నిలబెట్టాలని ఎన్టీయార్ చూస్తున్నాడు.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీయార్ కళ్యాణ్ రామ్ బాలయ్య ముగ్గురే హీరోలు ఉన్నారు అందులో బాలయ్య కి ఎన్టీయార్ కి మధ్య పెద్ద సన్నిహిత సంభదలు లేవు కాబట్టి తన బామ్మర్ది ఇండస్ట్రీ లో క్లిక్ అయితే తన అందుబాటు లో కూడా ఒక హీరో ఉంటాడు అని ఎన్టీయార్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?