ఈ విషయంలో ఎన్టీఆర్‌ మౌనమే అన్ని విధాలుగా మంచిది

ఈ విషయంలో ఎన్టీఆర్‌ మౌనమే అన్ని విధాలుగా మంచిది

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, మీరా చోప్రా విషయం ముదిరి పాకాన పడినది.సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న ట్రోల్స్‌తో మీరా చోప్రా విసిగి పోయి తెలంగాణ డీజీపీతో పాటు మంత్రి కేటీఆర్‌ మరియు మాజీ ఎంపీ కవితకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ విషయంలో ఎన్టీఆర్‌ మౌనమే అన్ని విధాలుగా మంచిది

దాంతో వెంటనే కేటీఆర్‌ స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.ఈ విషయంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ విషయంలో ఎన్టీఆర్‌ మౌనమే అన్ని విధాలుగా మంచిది

ఆయన ఫ్యాన్స్‌ విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నాడు అనేది అందరు ఆసక్తిగా ఉన్నారు.

మీరా చోప్రాకు మద్దతుగా నిలిచి తన ఫ్యాన్స్‌కు వార్నింగ్‌ ఇవ్వాలని చాలా మంది డిమాండ్‌ చేశారు.

ఇదే సమయంలో ఫ్యాన్స్‌కు మద్దతుగా ఎన్టీఆర్‌ ఉండాలని అంటున్నారు.మొత్తానికి ఈ విషయంలో ఎన్టీఆర్‌ ఇరుకున్న పడ్డట్లయ్యాడు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఈ విషయంలో మౌనంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది అనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఎటు మాట్లాడినా మరో వైపు తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. """/"/ మీరా చోప్రాకు మద్దతుగా నిలిచి తన ఫ్యాన్స్‌ చేసిన పనికి ఆమెకు స్వారీ చెప్పాలని కొందరు సలహా ఇచ్చినా అప్పుడు ఫ్యాన్స్‌ను అవమానించినట్లవుతుంది, అలా అయితే ఎన్నో ఏళ్లుగా అభిమానిస్తున్న వారు తనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయ పడ్డారు.

అందుకే మీరా చోప్రాకు మద్దతు నిలవలేదు.అలాగే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మద్దతుగా నిలిస్తే మహిళ లోకం ఎన్టీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది.

దాంతో పాటు ఎన్టీఆర్‌పై కేసు కూడా నమోదు అయ్యే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు.

అందుకే మౌనం అన్ని విధాలుగా మంచిదని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నాడు.