అదే జరిగితే రాజమౌళిని చంపేసేలా ఉన్నారు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి సన్నిహితులు అనే సంగతి తెలిసిందే.స్టూడెంట్ నంబర్1 సినిమాతోనే అటు ఎన్టీఆర్ కు, ఇటు రాజమౌళికి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కానీ రాజమౌళి కానీ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.

తాజాగా ఒక సందర్భంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు.

ప్రేక్షకుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్ కావాలనే డిమాండ్ వ్యక్తమవుతోందని మేము కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్ కావాలని కోరుకుంటున్నామని ఎన్టీఆర్ వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి రాజమౌళి సీక్వెల్ ను తెరకెక్కించకపోతే ఆయనను చంపేసేలా ఉన్నారని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్‌ వస్తుందని ఆశిద్దామని తారక్ చెప్పుకొచ్చారు.ఆర్‌ఆర్‌ఆర్‌ లో భీమ్ పాత్రలో తారక్ అదరగొట్టారు.

సినిమాలో భీమ్ పాత్రకు బలమైన సన్నివేశాలు లేకపోయినా తన నటనతో తారక్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లారు.

"""/"/ తారక్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించగా తారక్ ఒలీవియా కాంబినేషన్ లో వచ్చే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకు ఇప్పటివరకు 967 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోనుంది.

"""/"/ ఈ వీకెండ్ లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

గని సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కలెక్షన్ల విషయంలో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో బాహుబలి2 సృష్టించిన రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

నాగార్జున వెంకటేష్ బాలయ్య హీరోలని నాకు తెలియదు.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!