ఎన్టీఆర్ కోసం దీపికా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకొక అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా జాన్వి కపూర్, కియరా అద్వానిల పేర్లు వినపడగా ఇప్పుడు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడుతుంది.

బాలీవుడ్ లో దీపిక క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అలాంటి అమ్మడు ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తుంది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుందని టాక్.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఈ హిట్ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీగా ఈ ప్రాజెక్ట్ క్రేజీగా వస్తుంది.

ఈ సినిమాను సాయి సుధ ప్రొడక్షన్స్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని 2023 సమ్మర్ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

మరి తారక్ తో దీపిక రొమాన్స్ కన్ఫర్మా కాదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్‌మెంట్‌ పార్క్.. అంతా ఏఐ మహిమ..!