తారక్ బర్త్ డే స్పెషల్.. ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే..అసలు విషయం చెప్పిన మేకర్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వరుస సినిమాలకు కమిట్ అవుతూ దూకుడు కనబరుస్తున్నారు.

రాజమౌళి (Rajamiuli) దర్శకత్వంలో ఈయన నటించిన RRR సినిమా ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ(Koratala Shiva) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమాకు దేవర (Devara)అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఇలా ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేయబోతున్న విషయాన్ని గత ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఎప్పటినుంచి షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని 2024 సంవత్సరం నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతుందని ప్రకటించారు.

"""/" / ఇక ప్రశాంత్ నీల్ సైతం ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ (Salar) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ఈ ఏడాది విడుదల కాబోతుందనీ తెలుస్తుంది.

ఇలా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసి వచ్చే మార్చ్ లో షూట్ కి వెళ్లనున్నట్టు సమాచారం.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?