తన కొడుకుల సినీ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
TeluguStop.com
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr )గురించి మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ఇటీవలే పాన్ ఇండియా మూవీ దేవరతో( Devara ) ప్రేక్షకులను పలకరించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.
ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీ విషయాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
అయితే దేవర సినిమా విడుదలకు ముందు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఎన్టీఆర్ అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ తన కొడుకులు అభయ్ భార్గవుల గురించి మాట్లాడారు.
"""/" /
వాళ్లిద్దరి ఆలోచనా తీరులో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.భవిష్యత్తులో వాళ్లను సినీ పరిశ్రమలోకి తీసుకువస్తారా? అని ప్రశ్నించగా తారక్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.నా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నాకు నచ్చదు.
అలా నేను చేయను.ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నేను కచ్చితంగా నమ్ముతాను.
వారు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలి.ఇది చెయ్, అది చెయ్ అని అడ్డంకులు సృష్టించకూడదు.
వాళ్లిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.సినిమాల్లోకి అడుగుపెట్టు యాక్టింగ్‌లోనే రాణించాలి అని వాళ్లను బలవంతం చేయను.
"""/" /
ఎందుకంటే నా తల్లి దండ్రులు నన్ను ఆవిధంగా ట్రీట్ చేయలేదు.
ఏదో సాధించాలనుకుంటున్నాడు చేయని అని అనుకున్నారు.అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేను కూడా గౌరవించాలనుకుంటున్నాను.
నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు.తండ్రిని నటుడిగా చూసినప్పుడు, ఆ బాటలోనే అడుగులు వేయాలని తనయులు కూడా కోరుకుంటారు.
ఇది సహజంగా జరుగుతుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వడలుగా మారాయి.
అయితే ఎన్టీఆర్ చేసిన వాఖ్యల్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ ను ఇన్స్పైర్గా తీసుకొని తన కొడుకులలో ఎవరో సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఎంట్రీ ఇస్తారని అనిపిస్తోంది.
విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?