బళ్లెంతో గురిపెట్టిన భీం.. పోస్టర్‌తో కేకపెట్టించిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ నిన్న ప్రకటించడంతో, అది ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక తారక్ పుట్టినరోజు కానుకగా ఈ సర్‌ప్రైజ్‌ను ఆర్ఆర్ఆర్ యూనిట్ కొద్ది నిమిషాల క్రితమే రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌తో తారక్ కేకపెట్టించాడని చెప్పాలి.కొమురం భీం పాత్రలో తారక్ ఎలాంటి మేకోవర్ చేశాడో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో మనం చూశాం.

ఇప్పుడు మరికొంత ఇంటెన్స్‌గా తారక్‌ను చూపించే ప్రయత్నం చేశాడు జక్కన్న.చేతిలో బళ్లెం ఎక్కుపెట్టి ప్రత్యర్థికి గురిపెట్టిన కొమురం భీంను మనకు ఈ పోస్టర్‌లో చూపించారు.

తారక్ లుక్స్ ఈ పోస్టర్‌లో ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో, ఈ సినిమాలో ఆయన పాత్ర, పర్ఫార్మెన్స్ అంతకుమించి ఉండబోతున్నాయని ఈ పోస్టర్ చెప్పేస్తుంది.

ఇక ఈ కొమురం భీం పాత్ర తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ పాత్రగా తారక్ చెప్పుకొచ్చాడు.

కాగా కొమురం భీం పాత్రకు సంబంధించి ‘భీం బంగారం లాంటి హృదయం కలవాడు.

ఎదురుతిరిగితే మాత్రం ప్రత్యర్థులకు చుక్కలే’ అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్‌ను పెట్టారు చిత్ర యూనిట్.

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి రిలీజ్ అయిన తారక్ కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను దడదడలాడిస్తోంది.

తారక్ పుట్టినరోజున ఇలాంటి ట్రీట్ కోసమే తాము ఎదురుచూస్తున్నామని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

స్కూల్‌కు లేటుగా వచ్చిందని టీచర్‌ను చావబాదిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్..