యంగ్ టైగర్ నీల్ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్.. బడ్జెట్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్(
Junior NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
అలాగే మరోవైపు బాలీవుడ్ మూవీ వార్ 2(
War 2) లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.
ఈ సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి. """/" /
ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( Prashanth Nee) దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను లాంచ్ చేశారు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు మొదలవడంతో ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోందని సమాచారం.
అయితే ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, ప్రశాంత్ నీల్ కెరీర్ లో కూడా ఇదే బిగ్ బడ్జెట్ సినిమా అవుతుందని చెప్పవచ్చు.
/br> """/" /
కాగా ప్రశాంత్ నీల్ చివరగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ( Salaar)తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపుగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
సలార్ సినిమాను కాస్త అటుఇటుగా రూ.270 కోట్ల తో తెరకెక్కించారు.
ఎన్టీఆర్ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న నీల్ ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కోట్ చేశాడట.
నిజానికి ఈ కథను ఇప్పటివరకు నీల్ తెరపైకి తీసుకురాకపోవడానికి కూడా కారణం ఇదే అని తెలుస్తోంది.
ఈ కథకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందని, అందుకే ఏళ్లుగా ఈ స్టోరీని తెరపైకి తీసుకురాకుండా అలా పక్కన పెట్టాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే ఎట్టకేలకు మైత్రీ మూవీ మేకర్స్ రూపంలో ఖర్చుకు వెనకాడని నిర్మాతలు దొరకడంతో నీల్ ఈ కథను బయటకు తీశాడు.
ఎన్టీఆర్ తో తన డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు.
డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!