దేవర సీక్వెల్ కు ఇప్పట్లో ఛాన్స్ లేదా.. ఎన్టీఆర్ లైనప్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసిందా?
TeluguStop.com
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.
( Devara ) ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కనుండగా మొదటి భాగం ఇటీవలె విడుదల అయింది.
ఇక పార్ట్ 2 త్వరలోనే విడుదల కానుంది అంటూ మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే పార్ట్ 2 విడుదల విషయంలో ఇప్పటకే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
"""/" /
ఈ సినిమా ఇప్పుడే విడుదల కాదు.ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.
ఇకపోతే హారిక హాసిని సిస్టర్ కన్సర్న్ గా స్టార్ట్ అయింది సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ.
ఈ సంస్థ నుంచి ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పుడు బాలయ్య, విజయ్ దేవరకొండ, రవితేజ ల సినిమాలు రాబోతున్నాయి.ఇప్పుడు వాటన్నింటిని మించి ఒక పాన్ ఇండియా సినిమా రాబోతోంది.
ఎన్టీఆర్- నీల్సన్ సినిమాను సితార బ్యానర్ నిర్మించబోతోంది.కాగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలలో నీల్సన్ సినిమా కూడా ఒకటి.
"""/" /
వార్ 2, ప్రశాంత్ నీల్, సినిమాల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా నీల్సన్ దే.
ప్రస్తుతం వార్ 2,( War 2 ) ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సినిమాల పని మీద వున్నారు తారక్.
వాటిలో ఒకటి పూర్తి కాగానే వెంటనే నీల్సన్( Nelson ) సినిమా పనులు మొదలు పెట్టనున్నారు.
ఈ ప్రకారంగా చూసుకుంటే దేవర సినిమాకు ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ చేతిలో ఉన్న మూడు సినిమాలు తర్వాతనే దేవర 2( Devara 2 ) సినిమా పని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?