లోకేష్ తో ఎన్టీఆర్ భేటీ ! పాలిటిక్స్ పై క్లారిటీ ?
TeluguStop.com
టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడం, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం కి వెళ్లి ఆయనతో భేటీ అయిన దగ్గర నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది అనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తుండడంతో, టిడిపిలో యాక్టివ్ గా లేని నేతలంతా ఒకసారిగా యాక్టివ్ అయ్యారు.
అలాగే టిడిపి నుంచి పోటీ చేసేందుకు పోటీలు పడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో నందమూరి వారసుడు, సినీ హీరో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుత ఏపీ రాజకీయాలతో పాటు అనేక విషయాల పైన , కుటుంబ వ్యవహారాల పైన వీరిద్దరి మధ్య చర్చి జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే తన ఉద్దేశాన్ని తారకరత్న లోకేష్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్రంలో తారకరత్న వరుసగా పర్యటనలు చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
ప్రస్తుత తరుణంలో బిజెపి తో జనసేన పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో, గెలుపునకు డోకా ఉండదనే లెక్కల్లో తారకరత్న ఉన్నారట.
అందుకే నారా లోకేష్ ను కలిసి ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటు, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని గురించి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
"""/"/
ఈ సందర్భంగా ఏ నియోజకవర్గంలో నుంచి తారకరత్న పోటీ చేయాలనుకుంటున్నారనే విషయాన్ని లోకేష్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
ఇక దీనికి సంబంధించి తారకరత్న తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
'' నన్ను కలవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు .మీ అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం .
మున్ముందు మేము కలిసి ఎలా పని చేయాలో చర్చించే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను .
దీనినే కొనసాగించి మన తెలుగుదేశం పార్టీలో సానుకూల ప్రభావం చూపేందుకు నేను ఎదురు చూస్తున్నాను '' అంటూ తారకరత్న ట్వీట్ చేశారు.
ఇక నందమూరి కుటుంబం పూర్తి మద్దతు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. """/"/
జూనియర్ ఎన్టీఆర్ టిడిపి తరఫున యాక్టివ్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బాబు ఆశలు పెట్టుకుంటున్న, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లుగా వ్యవహరిస్తూ, సినిమాల్లోనే బిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టిివ్ గా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు .
రాబోయే ఎన్నికల్లో తారకరత్న కు కూడా బాబు సీటు కేటాయిస్తే నందమూరి అభిమానుల మద్దతు కూడా టిడిపికి పూర్తిస్థాయిలో లభిస్తుందనే ఆలోచన పార్టీ నాయకుల్లో ఉన్న , బాబు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ లేదు.
అయితే ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కృష్ణ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారట.
హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?