ఎన్టీయార్ దేవర మూవీ చేసి తప్పు చేశాడా..? ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమా మీద నమ్మకం లేదా..?
TeluguStop.com
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (
Junior NTR )తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పటికే ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన 'దేవర( Devara ) ' సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
మరి వాటికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి ఆయన చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
"""/" /
ఇక మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా మీద వాళ్లకు ఎలాంటి అంచనాలు లేవని, ఎన్టీయార్ ఈ సినిమాని అనవసరంగా చేశాడు అంటూ వాళ్ల ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి బదులు వేరే సినిమా చేసిన కూడా ఎన్టీఆర్ కి ఒక మంచి సక్సెస్ అయితే వచ్చిండేదని ఇప్పుడు ట్రైలర్ గానీ, పాటలు గానీ ఏ మాత్రం మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం లేదంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు.
"""/" /
మరి ఎన్టీఆర్ ఈ సినిమా చేసి మంచి పని చేశాడా? లేదంటే సినిమా చేయకుండా ఉంటే బాగుండేదా? అనే రీతిలో కొంతమంది సినీ పండితులు సైతం ఎన్టీఆర్ మీద వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో ఎన్టీఆర్ మాత్రం భారీ హిట్టు కొడతానని దృఢ సంకల్పంతో ఉన్నాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలపడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి ఇప్పుడు వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెడతారా లేదా అనేది.
గర్ల్‌ఫ్రెండ్ లేని వారికి అదిరిపోయే ఐడియా.. ఈ జపనీస్ వ్యక్తి క్రియేటివిటీ అదుర్స్ ..?