ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన 'తిమ్మరుసు' ట్రైలర్ టాక్‌

యంగ్‌ హీరో సత్య దేవ్‌ తాజా చిత్రం 'తిమ్మరుసు' ఈనెల 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

తిమ్మరుసు సినిమా సెకండ్‌ వేవ్‌ తర్వాత రాబోతున్న మొదటి సినిమా.అందుకే ఈ సినిమాపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంది.

ఈ సినిమా ట్రైలర్‌ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించారు.సినిమా నిర్మాత మహేష్‌ కోనేరు చాలా కాలంగా ఎన్టీఆర్‌ కు వ్యక్తిగత పీఆర్ గా చేస్తున్నారు.

అందుకే ఆయన నిర్మించిన సినిమా ట్రైలర్‌ ను ఎన్టీఆర్‌ విడుదల చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌ ట్రైలర్ విడుదల చేసి ప్రశంసలు కురిపించాడు.బాగుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్‌ లాయర్‌ గా కనిపించబోతున్నాడు.లాయర్‌ గా ఒక పాత కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేయించడం వల్ల ఆయన చిక్కుల్లో పడతాడు.

ఒక సింపుల్ లాయర్‌ కాస్త ఆ కేసు వల్ల చాలా ఫేమస్ లాయర్ అవుతాడు.

ఆ కేసు ఏంటీ ఆ లాయర్ కథ ఏంటీ ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనేది సినిమ అన్నట్లుగా ట్రైలర్ లో మొత్తం కథను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు.

మొత్తానికి ఈ సినిమా ట్రైలర్‌ తో అంచనాలు పెంచడంలో సక్సెస్‌ అయ్యింది. """/"/ థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ లేని ఈ సమయంలో విడుదల కాబోతున్న సినిమా అవ్వడం వల్ల ఎలాంటి ఫలితం ను దక్కించుకుంటుంది అనేది అందరికి ఆసక్తిగా ఉంది.

తిమ్మరుసు సినిమా ను విడుదల చేసిన తర్వాత టాలీవుడ్ నుండి మరిన్ని సినిమాలు వస్తాయా లేదా అనేది చూడాలి.

తిమ్మరుసు థియేటర్లకు జనాలు వస్తే అప్పుడు సినిమా ను విడుదల చేసేందుకు ఇతర నిర్మాతలు ముందుకు వస్తారు.

తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్‌ కు జోడీగా ట్యాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే