తారక్ కొరటాల ప్రాజెక్ట్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ బ్యూటీ నటిస్తుండగా.రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంది.

ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తారక్ ఎప్పుడో పూర్తి చేసుకున్న కూడా తర్వాత ప్రాజెక్టు ఇప్పటి వరకు సెట్స్ మీదకు తీసుకువెళ్లలేక పోయాడు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.

ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.అయితే త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్ల బోతున్నారని టాక్.

అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను అక్టోబర్ 30న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఆ తర్వాత నవంబర్ రెండవ వారం నుండే రెగ్యురల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

"""/"/ ఇక ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

కొరటాల సినిమాలంటే సందేశాత్మకంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో తారక్ విద్యార్థి నుండి కార్పొరేట్ సీఈఓగా ఎలా ఎదిగాడు అనే వైనాన్ని స్ఫూర్తిదాయకంగా తెరకెక్కించ బోతున్నట్టు సమాచారం.

మరి ఇప్పటికే ఈ కాన్సెప్ట్ మీద మహర్షి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

"""/"/ మరి ఈ సినిమా కూడా అలంటి జానర్ అనే తెలుస్తుంది.అయితే కొరటాల సినిమా సినిమాకి టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో తారక్ ను కూడా డిఫరెంట్ గా చూపిస్తాడనే అభిమానులు అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్ ఆలియా భట్ తో రొమాన్స్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

చూడాలి మరి ఈ సినిమాను కొరటాల ఎలాంటి సందేశాత్మకంగా తెరకెక్కిస్తాడో.

తప్పుడు ప్రచారం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట..: సీఎం రేవంత్