హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలయికలో ”వార్ 2”.. ఊహించని కాంబోపై నెక్స్ట్ లెవల్ ఎగ్జైట్మెంట్!
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత భారీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఈ సినిమా ఇటీవలే అఫిషియల్ గా పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యింది.ఇక గత కొన్ని రోజుల క్రితమే రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
'NTR30' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుండగా ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కూడా ఫిక్స్ చేసుకున్నాడు.
"""/" /
ఎన్టీఆర్ తన 31వ (NTR31) సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.
ఇప్పటికే అఫిషియల్ అప్డేట్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి భారీ అంచనాలను పెంచేశారు.
మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.ఇదిలా పక్కన పెడితే ఈ రోజు ఎన్టీఆర్ నుండి ఊహించని అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఎన్టీఆర్ బాలీవుడ్ (Bollywood) లో సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. """/" /
ప్రస్తుతం ప్రకటించిన రెండు సినిమాలపైనే భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు వీటికి మించి మరొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తారక్ ఓకే చేయడం ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)- ఎన్టీఆర్ కాంబోలో ''వార్'' (War 2) సీక్వెల్ వస్తుందని.
బాలీవుడ్ కన్ఫర్మ్ చేసింది.ఈ ఊహించని కాంబోపై అందరిలో ఆసక్తి పెరిగింది.
సౌత్ నుండి ఎన్టీఆర్, నార్త్ నుండి హృతిక్ కలయిక కావడం ఇండియా మొత్తంలో నెక్స్ట్ లెవల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది.