ఆ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్స్ కానీ హీరోకు ఒక్క పాటా లేదు..?

అన్నా చెల్లెలు, అన్నాదమ్ములతో వచ్చిన తెలుగు సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి.

1975లో వచ్చిన "అన్నదమ్ముల అనుబంధం( Annadammula Anubandham )" సినిమా కూడా బ్లాక్ బస్టర్‌ హిట్ సాధించింది.

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.నిజానికి ఈ సినిమాని హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన "యాదోం కి బారాత్" మూవీ ఆధారంగా తీశారు.

తెలుగులో పెద్ద హిట్ కావడానికి కారణం ఇందులోని పాటలు అని చెప్పుకోవచ్చు.అలాగని తెలుగు వాళ్లు కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేయలేదు.

హిందీ సినిమాలోని ట్యూన్లనే యాజ్ టీజ్ తెలుగు పాటలకు వాడుకున్నారు. """/" / హిందీ ట్యూన్లు బాగుండటం వల్ల అలా చేశారు.

ప్రేక్షకులకు కూడా ఇవి బాగా నచ్చడంతో తెలుగు సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి."ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే", "గులాబి పువ్వై నవ్వాలి వయసు", "కౌగిలిలో ఉయ్యాలా", "అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది", "ఆనాడు తొలిసారి నిన్ను చూసి మురిసాను నేను" వంటి ఈ సినిమాలోని పాటలన్నీ చాట్‌బస్టర్స్ అయ్యాయి.

దీనికి చక్రవర్తి ( Chakravarthy )మ్యూజిక్ అందించాడు.ఈ పాటలో ఇప్పటికీ కొంతమంది ఇళ్లలో వినిపిస్తుంటాయి.

"""/" / యస్.డి లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ , కాంచన, లత, జయమాలిని, రాజబాబు, పుష్పలత తదితరులు యాక్ట్ చేశారు.

హిందీ మూవీ "యాదోం కి బారాత్"లో ధర్మేంద్ర , విజయ అరోరా, తారిఖ్ ఖాన్, జీనత్ అమన్, నీతూ సింగ్ , అజిత్ వంటి వారు నటించి మెప్పించారు.

తెలుగు సినిమా వంద రోజులు ఆడింది.100 డేస్ ఫంక్షన్ చాలా ఘనంగా జరిపారు.

దీనికి MGR , శివాజీ గణేశన్, హిందీ హీరో రాజకుమార్ చీఫ్ గెస్ట్స్‌గా వచ్చి సందడి చేశారు.

ఇందులో చాలానే హిట్ పాటలు ఉన్నాయి కానీ హీరో ఎన్టీఆర్‌( SR Ntr ) మీద ఒక్క పాట షూట్ చేయలేదు.

అలా ఎందుకు చేయలేదో ఈ సినిమా కథ రాసిన వారికి తెలియాలి.హిందీ సినిమాలో ధర్మేంద్రకూ కూడా ఒక సాంగ్ కూడా పెట్టలేదు.

మంచి పాటలు మంచి కథతో మనసులను హత్తుకునే ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబులో చూడవచ్చు.

నందమూరి అభిమానులు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు.విశేషమేంటంటే బాలయ్య బాబుకు ఈ సినిమాతో చాలా మంచి పేరు వచ్చింది.

ఈ సినిమాలో బాలకృష్ణ( Balakrishna ) అంత బాగా నటించాడు మరి.

రోజూ స్నానానికి ముందు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నడుపు నొప్పి దూరం అవ్వాల్సిందే!