అప్పట్లో సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. కారణం?
TeluguStop.com
కొన్ని కొన్ని సమయంలో దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్ లకు మధ్య కొన్ని కొన్ని గొడవలు జరగడం కామన్ అనే చెప్పాలి.
ఎందుకంటే తాము నటించిన సినిమాల విషయంలో ఏదైనా పొరపాటు జరిగితేనే గొడవలు జరుగుతుంటాయి.
ఆ గొడవలు కొన్ని సమయాలలో పెద్దగా మారటంతో మళ్లీ వారి మధ్య మరో సినిమా అనే ఆలోచన కూడా ఉండదు.
ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్ కు సుకుమార్ కూడా చిన్న గొడవ జరిగింది.
అది కూడా సుకుమార్ కే వార్నింగ్ ఇచ్చాడట ఎన్టీఆర్.ఇంతకీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే.
చాలా వరకూ తను నటించిన సినిమాలన్నీ మంచి హిట్ లను ఇచ్చాయి.చాలావరకు మంచి మంచి దర్శకుల దర్శకత్వంలో నటించాడు ఎన్టీఆర్.
ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎటువంటి గొడవలకు దిగలేదు.పైగా ఎవరితో కూడా గట్టిగా వాదించలేదు.
కానీ ఓ సారి ఓ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.
"""/"/
ఇంతకూ అసలు ఏం జరిగిందంటే.ఎన్టీఆర్ తో సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా 2016 లో మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక గతంలో ఈ సినిమా ప్రారంభం కాకముందు వీరిద్దరి మధ్య చిన్న వార్నింగ్ జరిగిందట.
ఎన్టీఆర్ ఈ సినిమా కంటే ముందు మరో సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇక సుకుమార్ కూడా మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాను చేస్తున్నాడు.
"""/"/
ఇక ఆ సమయంలో సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేయాలని కథ వినిపించాడట.
ఈ కథ విన్నాక ఎన్టీఆర్ తాను ఆ సమయంలో తీస్తున్న సినిమా పూర్తయిన వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాలో చెయ్యాలని అనుకున్నాడట.
ఈ విషయాన్ని సుకుమార్ తో కూడా చెప్పడంతో సుకుమార్ కూడా ఒప్పుకున్నాడట.ఇక ఎన్టీఆర్ ఆ సమయంలో తనకు ఎన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా నాన్నకు ప్రేమతో సినిమా కోసం వదులుకున్నాడని తెలిసింది.
కానీ సుకుమార్ ఆ సమయంలో మరో సినిమా చేయడం కోసం ప్లాన్ చేశాడని దీంతో ఎన్టీఆర్ సినిమాకు కాస్త బ్రేక్ ఇద్దామని అనుకున్నాడని తెలిసింది.
ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియటంతో ఎన్టీఆర్ సుకుమార్ పై కాస్త కోపంగా మాట్లాడాడని తెలిసింది.
నాన్నకు ప్రేమతో సినిమా కోసం వచ్చిన అవకాశాలన్ని కోల్పోయానని అన్నాడట. """/"/
ఇక ఇప్పుడు మళ్లీ ఇలా చేస్తే ఎలా అని బాధ పడ్డాడట.
ఇక ఈ సినిమా ఇప్పుడే తీస్తేనే చేస్తానని లేదంటే వదులుకుంటానని సుకుమార్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట ఎన్టీఆర్.
సుకుమార్ కూడా తన పరిస్థితి అర్థం చేసుకొని మహేష్ బాబు సినిమా పూర్తయిన వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాను చేశాడని తెలిసింది.
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కు మంచి సక్సెస్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు కూడా అందుకున్నాడు ఎన్టీఆర్.
బాలయ్యను రిక్వెస్ట్ చేసి ఎన్టీఆర్ నటించిన రోల్ ఇదే.. ఆ రోల్ వెనుక ఇంత కథ ఉందా?