ఆ దేశానికి వస్తానని లేడీ ఫ్యాన్ కు మాట ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రతి ఏడాది బియాండ్ ఫెస్ట్( Beyond Fest ) అనే ఒక ప్రతిష్టాత్మక చిత్రోత్సవ కార్యక్రమం జరుగుతుంది అన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ బియాండ్ ఫెస్ట్ ని నిర్వహించారు.

ఇక ఇందులో తాజాగా దేవర సినిమాను( Devara ) ప్రదర్శించడం జరిగింది.ఈనేపథ్యంలోనే బియాండ్‌ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌( NTR ) అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.

అనంతరం తనని కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులతో ముచ్చటించారు. """/" / ఇందులోభాగంగా.

మీ దేశానికి తప్పకుండా వస్తా అంటూ ఒక మహిళా అభిమానికి( Lady Fan ) మాట ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఇతర హీరోల మాదిరిగానే ఎన్టీఆర్ కి కూడా ఇతర దేశాలలో వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్ కూడా ఇతర దేశాలలో అభిమానులు ఉన్నారు అన్న విషయం బయటపడింది.

ముఖ్యంగా జపాన్‌లో( Japan ) ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ.ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఒక మహిళా అభిమాని ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఎంతో ప్రయత్నించింది.

"""/" / బియాండ్‌ ఫెస్ట్‌లో ఆయన పాల్గొంటున్నారని తెలిసి టోక్యో నుంచి జర్నీ చేసి లాస్‌ ఏంజెలిస్‌కు చేరుకుంది.

అభిమాన నటుడిని కలిసి మాట్లాడింది.తారక్‌ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది.

ఆమె మాటలకు ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తంచేశారు.తప్పకుండా వస్తానని మాటిచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఇయర్ కి భారీ ఎండింగ్ ఇస్తున్న అల్లు అర్జున్…