అంతటి లెజెండరీ యాక్టర్ కంటే అద్భుతంగా నటించి సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..
TeluguStop.com
నటనలో సీనియర్ ఎన్టీఆర్‌కి( N T Ramarao) తిరుగులేదు.ఆయన రీమేక్ సినిమాలు తీస్తే ఒరిజినల్ సినిమాల్లోని హీరోల కంటే గొప్పగా నటించి చాలా మంచి పేరు తెచ్చుకునేవారు.
ఆ రీమేక్ సినిమాలు ఒరిజినల్ సినిమాల కంటే అతిపెద్ద సూపర్ హిట్స్ అయ్యాయి.
అలాంటి వాటిలో "నేరం నాది కాదు ఆకలిది ( Neram Nadhi Kadhu - Akalidhi )(1976)" అనే యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఒకటి.
లాల్ దర్శకత్వం వహించారు.ఇందులో ఎన్టీఆర్, మంజుల హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇది హిందీ చిత్రం రోటీ (1974)( Roti )కి రీమేక్.హిందీలో రాజేష్ ఖన్నా, ముంతాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే తెలుగు రీమేక్ మూవీ 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.
దీన్ని రవి చిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై వై.వి.
రావు డైరెక్ట్ చేశారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పు నిజం చెప్పాలంటే అంతటి రాజేష్ ఖన్నాను మించి అద్భుతమైన యాక్టింగ్ పర్ఫామెన్స్ కనబరిచారు ఎన్టీఆర్.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇందులో పగ, కక్ష , నేరాలు , పోలీసులు వంటి రొటీన్ వాసనే కనిపిస్తుంది.
కానీ టేకింగ్, ఎగ్జిక్యూషన్, లోకేషన్స్ , సత్యం మ్యూజిక్ , లిరిక్స్, గొల్లపూడి మారుతీరావు డైలాగులు ఈ సినిమాని ఒక మంచి దృశ్య కావ్యంగా నిలిపాయి.
ఈ సినిమాలోని సి.నారాయణరెడ్డి రాసిన, బాల సుబ్రమణ్యం పాడిన "మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి" పాట సూపర్ హిట్ అయింది.
ఒక క్యారెక్టర్ మీద జనం రాళ్లు వేస్తుంటే ఎన్టీఆర్ వారిని వారించి ఈ పాట పాడుతుంటారు.
"""/" /
డైమండ్ రాణి పాట మినహాయించి, మిగిలిన పాటలన్నీ నారాయణరెడ్డి రాయగా వాటిని బాలునే పాడారు.
ఎన్టీఆర్-మంజుల కెమిస్ట్రీ కూడా చూడదగిన విధంగా బాగుంటుంది."చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా" గ్రూప్ డ్యాన్స్‌లో మంజుల అదిరిపోయే డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.
"పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా" అని అల్లు రామలింగయ్య పాడే ఓ పాటలో కూడా ఎన్టీఆర్-మంజుల జంట చాలా బాగా నటించి మెప్పించింది.
"""/" /
ఈ సినిమాలో అంధ తల్లిదండ్రులైన గుమ్మడి- పండరీబాయిల కొడుకుగా మురళీమోహన్( Murali Mohan ) నటించాడు అతడి పాత్రకు శ్రవణ్ అని గొల్లపూడి చాలా పర్ఫెక్ట్‌గా పేరు పెట్టాడు.
రామాయణంలో శ్రవణుడిని దశరధుడు అనుకోకుండా చంపేస్తాడు.ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ పొరపాటున మురళీమోహన్ నదిలో పడటానికి కారణమయ్యే అతని చావుకి దారి తీస్తారు.
దానికి అనుగుణంగానే ఈ పాత్రకు పేరు పెట్టి వావ్ అనిపించారు రచయిత.మరో ఆసక్తికరమైన విశేషమేంటంటే, సినీ రచయిత ఆరుద్ర జడ్జిగా ఓ అతిధి పాత్రలో నటించే ఆశ్చర్యపరిచారు.
ఔట్‌డోర్ షూటింగ్స్ అన్నీ ఊటీలో జరపడం జరిగింది కాబట్టి లొకేషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి.
హిందీ సినిమాలో రాజేష్ ఖన్నా- ముంతాజ్ క్యారెక్టర్ లను చంపేస్తారు.అందువల్ల ఆ మూవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఆ క్యారెక్టర్లు బతికి ఉంటే బాగుండేదని ఒక అసంతృప్తి ప్రేక్షకుల్లో కలిగింది.తెలుగు సినిమా మాత్రం మంచి హిట్ అయింది.
ఈ రెండు సినిమాలు యూట్యూబ్‌లో చూడవచ్చు.
అరెస్ట్ కోసం ఆరాటపడుతున్న కేటీఆర్ .. ఎందుకు అందుకేనా ?